సెటిలర్స్ ఓట్లు ఎటు?
తెలంగాణల్లో మళ్లీ సెటిలర్స్ కీలకమయ్యారు. హైదరాబాద్ లో సింహభాగం ఓటర్లుగా ఉన్న సెటిలర్స్ చూపు ఈసారి ఎటు ఉండబోతోందన్న ప్రశ్న అందరిలోనూ నానుతోంది. 2014 ఎన్నికల సమయంలో సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు బాగా ఊపుమీదున్నాయి. అయితే ఎంతోకాలంగా హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రావాసులంతా టీడీపీ వైపే మొగ్గు చూపారు. దీంతో ఆ సమయంలో పదిహేను సీట్లను తెలుగుదేశం గెలుచుకుంది. అయితే ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పూర్తిగా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. దీంతో అప్పట్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. కానీ ఇప్పుడు వారి ఓట్లన్నీ ఎటు పడబోతున్నాయనే అంశం ఎటూ తేలకుండా ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ మహాకూటమికి ఓట్లేస్తారా? లేక కారు వైపు మొగ్గు చూపుతారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. రానున్న రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.