బాబు బోనెక్కుతారా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంలో అపరచాణిక్యుడే. అందులో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే వివిధ కేసుల్లో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, చివరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం వణుకుతూ కోర్టు బోను ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ చంద్రబాబు మీద 22 కేసులు ఉన్నా ఇప్పటి వరకూ కోర్టు మెట్లు ఎక్కలేదు. అదీ చంద్రబాబు టాలెంట్. ధార్మాబాద్ కోర్టు వ్యవహారంలో కూడా చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కుతారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. లోకేష్ కోర్టుకు హాజరవుతారని చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీలో కూడా బాబు కోర్టు మెట్లు ఎక్కరని సీనియర్ నేతలు ఖరాఖండీగా చెప్తున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుగుడులు, మరెన్నో కేసులు చూశారు. కానీ ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కలేదని, ఇప్పుడు ఇది కూడా అంతేనని ఆపార్టీ సీనియర్ నేతలు బాహాటంగానే చెప్తుండటం విశేషం.