పెట్రోల్ రేటు తగ్గటానికి కారణం అదే….
కాంగ్రెస్, టీడీపీ పొత్తే ఏపీలో పెట్రోలు ధరలు తగ్గటానికి కారణమా? అంటే అవును అని చెప్తున్నారు ఆపార్టీల కార్యకర్తలు. గత నాలుగేళ్ల ఎన్టీయే పాలనలో అరవై నుంచి ఎనబై ఏడు రూపాయలకు పెట్రోలు ధరలు పెరిగింది. డీజిలు ధరలు కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగింది. వామపక్షాలు, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలతోపాటు ప్రజాసంఘాలు కూడా ఇప్పటివరకు పదిసార్లకుపైన రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. ధర్నాలు చేసిన వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. కానీ ఒక్క పైసా కూడా తగ్గించలేదు. అయితే అనుకోకుండా తెలంగాణ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. దీంతో పెరిగిన పెట్రోలు ధరల మీద కాంగ్రెస్ బంద్ కు పిలుపు నిచ్చింది. దీనికి మిగతా పార్టీలు మద్దతు తెలిపాలని కోరింది. ఈ బంద్ కు టీడీపీ మద్దతు ప్రకటించటంతోపాటు అన్ని ప్రాంతాల్లో బంద్ లో పాల్గొంది. అదే రోజు సాయంత్రానికి చంద్రబాబు పెట్రోలు, డీజిలుపైన రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించటానికి పొత్తే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే నాలుగు రూపాయలు పెంచి ప్రభుత్వం తెలివిగా రెండు రూపాయలు తగ్గించటం కూడా ఇక్కడ కొసమెరుపు.